Skip to main content

Posts

Showing posts with the label ఆంధ్రప్రదేశ్‌

86 వేల కోట్ల పెట్టుబడికి ‘ఎస్సెల్’ సై

భారీ ప్రాజెక్టులతో సిద్ధమైన కంపెనీ చిత్తూరులో సోలార్‌ పరికరాల తయారీ ప్లాంట్‌ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూలు   విశాఖపట్నం, జనవరి 12(ఆంధ్రజ్యోతి):  ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త సుభాష్‌ చంద్ర యాజమాన్యంలోని ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా సిద్ధమైంది. చైనా కంపెనీ గోల్డెన్‌ కాంకర్డ్‌ హోల్డింగ్స్‌(జీసీఎల్‌) భాగస్వామ్యంలో కన్సార్షియం కింద ప్రాజెక్టులు చేపట్టనుంది. సుమారు రూ.86 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో రెండు ఎంఓయులపై సుభా్‌షచంద్రతో పాటు జీసీఎల్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ షు హువా సంతకాలు చేశారు. తమ కన్సార్షియం ఏపీలో సోలార్‌ పరికరాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందని సుభాష్‌ చంద్ర చెప్పారు. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్లాంట్‌లో సిలికా నుంచి సోలార్‌ ప్యానెల్స్‌ తయారుచేస్తారు. ఈ ప్లాంట్‌ చిత్తూరులోని తిరుపతి, శ్రీసిటీల మధ్య నిర్మించనున్నట్టు సుభా్‌షచంద్ర సూచనప్రాయంగా తెలిపారు. ఫలితంగా 15 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌  జీసీఎల్‌ భాగస్వామ్యంలోనే స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌ ఏ

భాగస్వామ్య సదస్సుకు అపూర్వ స్పందన

రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ మూడు రోజుల్లో 331 ఒప్పందాలు 4.8 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర సాయంతో కలిపితే 6 లక్షల కోట్లు రాష్ట్రంలో పది లక్షల మందికి ఉద్యోగావకాశాలు సన్‌రైజ్‌ ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఇలాంటి వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదు సీఐఐతో ఏపీ బంధాన్ని ఎవరూ విడదీయలేరు సదస్సులకు విశాఖే శాశ్వత వేదిక: సీఎం విశాఖపట్నం, జనవరి 12:  మూడు రోజుల సదస్సు... 41 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధుల భాగస్వామ్యం... 331 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు... ఆంధ్రప్రదేశ్‌కు తరలి రానున్న 4.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు! సీఐఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఫలితమిది! రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని నిర్వహించిన ఈ సదస్సు గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. దీని వల్ల రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వస్తాయని తొలుత అంచనా వేసిన వారు సైతం... సదస్సు జరిగిన తీరు, తరలి రానున్న పెట్టుబడులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రెట్టిం

తీరప్రాంతమే ఆంధ్రాకు అదృష్ట రేఖ: ఎడిబి కంట్రీ డైరెక్టర్‌ టెరెసా కో

పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్‌-చెన్నై కారిడార్‌  విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి):  వైజాగ్‌-చెన్నై ఇండసి్ట్రయల్‌ కారిడార్‌తో ఆంధ్రప్రదేశ్‌ రూపు రేఖలు మారిపోతాయని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) ఇండియా కంట్రీ డైరెక్టర్‌ టెరెసా కో అన్నారు. సోమవారంనాడిక్కడ సిఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో ఈ కారిడార్‌ అత్యంత కీలకంగా ఉండనుందని తెలిపారు. 85 కోట్ల డాలర్ల (సుమారు 6,000 కోట్ల రూపాయలు) విలువైన వైజాగ్‌- చెన్నై ఇండసి్ట్రయల్‌ కారి డార్‌.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు గల ఆంధ్రప్రదేశ్‌ తీర ముఖ చిత్రాన్ని మార్చివేయనుందని అన్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌లో ఉన్న జిల్లాల స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కేవలం 2 లక్షల రూపాయలుగా ఉందని, కారిడార్‌ కార్య రూపం దాలిస్తే 2035 నాటికి వీటి జిడిపి ఏకంగా 11,60,000 రూపాయలకు చేరుకుంటుందని ఆమె వివరించారు. అంతే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగు తాయని థెరీసా పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ కారిడార్‌లోని జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకత సామర్థ్యం ఏకంగా ఏడు రెట్లు వృద్ధి చెందుతుందని అన

2 లక్షల కోట్లు! .. రెండో రోజూ కొనసాగిన పెట్టుబడుల వెల్లువ

దేశంలోనే తొలిసారి రిటైల్‌ పాలసీ ప్రకటన  రూ.38,500 కోట్లతో విశాఖ ఉక్కు విస్తరణ  కృష్ణపట్నంలో 3 వేల కోట్లతో రీగ్యాసిఫికేషన్‌ ప్లాంట్‌  అమరావతిలో 800 కోట్లతో డబ్ల్యూటీసీ భారీ టవర్‌  ఐటీలో 3160 కోట్ల పెట్టుబడులు  ఫుడ్‌ ప్రాసెసింగ్‌లోకి 5892 కోట్లు  అమరావతికీ పెట్టుబడుల ప్రవాహం  13,300 కోట్ల విలువైన ఎంవోయూలు  హౌసింగ్‌లో హడ్కో 7500 కోట్లు  ఆంధ్రాబ్యాంకు 5వేల కోట్లు రుణం  విశాఖ సదస్సులో కొనసాగిన జోష్‌  విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి):  రెండో రోజూ అదే జోష్‌.. నవ్యాంధ్రలో నూతన ఉత్తేజాన్ని నింపేలా పెట్టుబడుల వెల్లువ. తొలి రోజు మూడు రంగాలకే పరిమితమైన పెట్టుబడుల హామీలు రెండో రోజు అనేక రంగాలకూ విస్తరించాయి. ‘బ్రాండ్‌ హైదరాబాద్‌’ తెలంగాణకు పరిమితమైనా ‘బ్రాండ్‌ చంద్రబాబు’పై పెట్టుబడిదారులు విశ్వాసం ఉంచారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 282 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ ఎంవోయూలు అమలైతే 8 లక్షల మంది నిరుద్యోగ యువత మోములపై చిరునవ్వులు విరబూయనున్నాయి. ఊహించినదాని కన్నా స్పందన అనూహ్యంగా ఉండటంతో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. స్వయంగా అన్ని ఒప్పందాలను తన

ఎపిలో ఐటి కంపెనీల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలు మందుకొచ్చారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి శాఖ మం త్రి పల్లె రఘునాధ రెడ్డికి అంగీకార పత్రాలను అందజేశారు. అలాగే ఇల్లినాయిస్‌ కామర్స్‌, ఎకనామిక్స్‌కు చెందిన ప్రతినిధుల బృందంతో మం త్రి బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ను సిస్ట ర్‌ స్టేట్‌గా గుర్తిస్తున్నట్లు ఇల్లినాయిస్‌ కామర్స్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ బ్రెజ్లా ప్రకటించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఉన్నత స్థాయి కమిటీని పంపించి పరిస్థితులు అంచనా వేసిన అనంతరం పెట్టుబడులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎరిక్‌ తెలిపారు.

ఏపిలో నెదర్లాండ్స్ పెట్టుబడులు

 చంద్రబాబుతో సమావేశమైన నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ ఆగ్రో ప్రాసెసింగ్, ఆక్వా రంగాలపై ఆసక్తి    సిఎం చంద్రబాబుపై ప్రశంసలు విజయవాడ , అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు డచ్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ ఆధ్వర్యంలో డచ్ వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి కనబరిచారు. దీనిపై ఒక రోడ్ మ్యాప్ రూపొందించేందుకు జాయింట్ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 16 నెలల పసికూనగా ఉన్న కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా 10 రంగాలపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి ఈ బృందానికి చెప్పారు.  ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైనె్సస్, టెక్స్‌టైల్స్ అప్పారల్స్, ఎలక్ట్రానిక్స్, మినరల్ ఇండస్ట్రీ, ఎయిరోస్పేస్, ఎనర్జీ, లెదర్, పెట్రో కెమికల్స్, ఆటోమొబైల్ రంగాలలో ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. సహజ వనరులు, మానవ వనరులతోపాటు విద్యుత్, భూమి, కనెక్టివిటీలో ఏపి అగ