Skip to main content

Posts

Showing posts with the label ఆంధ్ర ప్రదేశ్

86 వేల కోట్ల పెట్టుబడికి ‘ఎస్సెల్’ సై

భారీ ప్రాజెక్టులతో సిద్ధమైన కంపెనీ చిత్తూరులో సోలార్‌ పరికరాల తయారీ ప్లాంట్‌ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూలు   విశాఖపట్నం, జనవరి 12(ఆంధ్రజ్యోతి):  ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త సుభాష్‌ చంద్ర యాజమాన్యంలోని ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా సిద్ధమైంది. చైనా కంపెనీ గోల్డెన్‌ కాంకర్డ్‌ హోల్డింగ్స్‌(జీసీఎల్‌) భాగస్వామ్యంలో కన్సార్షియం కింద ప్రాజెక్టులు చేపట్టనుంది. సుమారు రూ.86 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో రెండు ఎంఓయులపై సుభా్‌షచంద్రతో పాటు జీసీఎల్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ షు హువా సంతకాలు చేశారు. తమ కన్సార్షియం ఏపీలో సోలార్‌ పరికరాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందని సుభాష్‌ చంద్ర చెప్పారు. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్లాంట్‌లో సిలికా నుంచి సోలార్‌ ప్యానెల్స్‌ తయారుచేస్తారు. ఈ ప్లాంట్‌ చిత్తూరులోని తిరుపతి, శ్రీసిటీల మధ్య నిర్మించనున్నట్టు సుభా్‌షచంద్ర సూచనప్రాయంగా తెలిపారు. ఫలితంగా 15 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌  జీసీఎల్‌ భాగస్వామ్యంలోనే స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌ ఏ

తీరప్రాంతమే ఆంధ్రాకు అదృష్ట రేఖ: ఎడిబి కంట్రీ డైరెక్టర్‌ టెరెసా కో

పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్‌-చెన్నై కారిడార్‌  విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి):  వైజాగ్‌-చెన్నై ఇండసి్ట్రయల్‌ కారిడార్‌తో ఆంధ్రప్రదేశ్‌ రూపు రేఖలు మారిపోతాయని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) ఇండియా కంట్రీ డైరెక్టర్‌ టెరెసా కో అన్నారు. సోమవారంనాడిక్కడ సిఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో ఈ కారిడార్‌ అత్యంత కీలకంగా ఉండనుందని తెలిపారు. 85 కోట్ల డాలర్ల (సుమారు 6,000 కోట్ల రూపాయలు) విలువైన వైజాగ్‌- చెన్నై ఇండసి్ట్రయల్‌ కారి డార్‌.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు గల ఆంధ్రప్రదేశ్‌ తీర ముఖ చిత్రాన్ని మార్చివేయనుందని అన్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌లో ఉన్న జిల్లాల స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కేవలం 2 లక్షల రూపాయలుగా ఉందని, కారిడార్‌ కార్య రూపం దాలిస్తే 2035 నాటికి వీటి జిడిపి ఏకంగా 11,60,000 రూపాయలకు చేరుకుంటుందని ఆమె వివరించారు. అంతే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగు తాయని థెరీసా పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ కారిడార్‌లోని జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకత సామర్థ్యం ఏకంగా ఏడు రెట్లు వృద్ధి చెందుతుందని అన

జపాన్‌, ఎపి మధ్య మరో రెండు ఎంఒయులు పెట్టుబడులకు సాదర స్వాగతం: చంద్రబాబు

విజయవాడ:  ‘‘నవ్యాంధ్రలో   పెట్టుబడులు   పెట్టేందుకు   ఎన్నో   అవకాశాలు   ఉన్నాయి.   జపాన్‌   ప్రభుత్వం  ఇందుకు   ముందుకు   వస్తోంది.   నూతన   రాజధానిని   అభివృద్ధి   చేయడానికి   జపాన్‌   ప్రభుత్వంతో   కలిసి   మరో   అడుగు   ముందుకు   వేస్తున్నాం’’   అని   ముఖ్యమంత్రి   చంద్రబాబునాయుడు   చెప్పారు.   ఎపి   ప్రభుత్వం   గురువారం   జపాన్‌   ఆర్థిక,   పరిశ్రమల   మంత్రిత్వశాఖ,   అంతర్జాతీయ   సహకార   జపాన్‌   బ్యాంక్‌తో   రెండు   ఒప్పందాలు(ఎంఒయు)   చేసుకుంది.   సిఆర్‌డిఎ   ఆధ్వర్యంలో   ఏర్పాటు   చేసిన   కార్యక్రమంలో   చంద్రబాబు   మాట్లాడుతూ   సింగపూర్‌,   జపాన్‌   లు   రెండూ   ఏపీకి   ఎంతో   సహకరిస్తున్నాయని   తెలిపారు.   ఆంధ్రప్రదేశ్‌లో   పెట్టుబడులు   పెట్టేందుకు   అనేక   అవకాశాలు   ఉన్నాయని   చెప్పారు.   జపాన్‌   ప్రభుత్వం   ఎపిలో   పట్టణాభివృద్ధికి,   ముఖ్యంగా   అమరావతిని   ప్రపంచ   స్థాయి   సిటీగా   తీర్చిదిద్దేందుకు   సహకరిస్తోందన్నారు.   బెంగుళూరు-చెన్నై   ఇండస్ర్టియల్‌   కారిడార్‌,   శ్రీకాకుళంలో   సూపర్‌   పవర్‌   ధర్మల్‌   పవర్‌   స్టేషన్‌   నిర్మాణంపై   చర్చలు   జరుగుతున్నాయని   చె