Skip to main content

Posts

Showing posts with the label మార్గదర్శి

చింతపిక్కలు ఏరుకున్న ఆ బీడీ కార్మికుల కూతురే.. ఇప్పుడు వందల మందికి మార్గదర్శి

మంచి చదువు, ఐదంకెల జీతం. చాలామంది యువతీ, యువకులు కోరుకునేది ఇదే. ఎలాంటి టెన్షన్లు లేకుండా జీవితం సాగిపోతే చాలనేది అందరి ఆలోచన. కానీ అశ్వేతా షెట్టి అలా ఆలోచించలేదు. చదువుకునేందుకు తాను పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఎంత శ్రమపడ్డది మర్చిపోలేదు. అలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రాకుండా ఉండేందుకు బోధి ట్రీ ఫౌండేషన్‌ను స్థాపించారు. గ్రామీణ ప్రాంత గ్రాడ్యుయేట్లు, విద్యార్థులకు ఇంగ్లీష్, కమ్యూనికేషన్లలో శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘‘ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ చిన్న గ్రామంలో నేను పెరిగాను. నా బాల్యం ఎంతో ఆనందంగా సాగింది. గ్రామాల్లో పిల్లలందరూ చేసినట్టుగానే బురదలో ఆడుతూ జామపండ్ల కోసం రాళ్లను విసురుతూ చింతపండును తెంపుతూ, శాలువాతో చేపలను పడుతూ ఆనందంగా గడిపాను. పెరిగి పెద్ద అయినప్పటి నుంచి ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. పెద్దల సమక్షంలో పురుషుల గురించి నేను మాట్లాడింది చాలా తక్కువ ’’ అని అశ్వేత షెట్టి ఆవేదన చెందుతారు. 13 ఏళ్ల వయసులో అశ్వేతా షెట్టికి ఎవరికీ