Skip to main content

Posts

Showing posts with the label అంతరిక్ష రంగం

ప్రజ్వలించిన పరిశోధన

కక్ష్యలోకి ఆస్ట్రోశాట్‌  నమ్మకం వమ్ము చేయని పీఎస్‌ఎల్‌వీ  మరో ఆరు విదేశీ ఉపగ్రహాలనూ కక్ష్యలోకి చేర్చిన రాకెట్‌  విశ్వంపై పరిశోధనలకు వీలు  శ్రీహరికోట : అంతరిక్ష రంగంలో భారత్‌ మరోసారి వెలుగులీనింది. నక్షత్రాలు, ఖగోళశాస్త్ర పరిశోధనల కోసం తొలిసారిగా ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి పంపింది. ఈ ఘనత సాధించిన అతికొద్ది దేశాల సరసన సగర్వంగా చేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అచ్చొచ్చిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారానే ఈ విజయయాత్ర సాగింది. దీంతోపాటు విదేశాలకు చెందిన మరో ఆరు ఉపగ్రహాలను కూడా గురి తప్పకుండా నిర్దిష్ట కక్ష్యల్లోకి ఈ వాహకనౌక ప్రవేశపెట్టింది. తొలిసారిగా అమెరికాకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం విశేషం. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ ఇందుకు వేదికగా నిలిచింది.  తాజా ప్రయోగం కోసం శనివారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన 50 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ సోమవారం ఉదయం 10.00 గంటలకు ముగిసింది. ఆ వెంటనే పీఎస్‌ఎల్‌వీ-సి30 రాకెట్‌లో మొదటి దశ ప్రజ్వలించింది. ఆస్ట్రోశాట్‌తోపాటు విదేశాలకు చెందిన మరో ఆరు ఉపగ్రహాలను మోసుకుంటూ రాకెట్‌ నింగిలోకి దూసు