Skip to main content

Posts

Showing posts with the label కొత్త ఆలోచన

63 సార్లు ఛీ.. పొమ్మన్నారు ! పట్టు వదలకుండా విజయం సాధించి చూపించిన విక్రమార్కులు

2014 లో ఆర్‌విసిఇ బెంగళూరు నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్‌లో, ఇంజనీరింగ్ పూర్తిచేసారు కౌశిక్ ముద్దా, నవీన్ జైన్‌లు. చివరి సంవత్సరంలో ఉండగానే, ఇద్దరికీ ఉద్యోగాలు లభించాయి. చాలా మందికి కల అయిన కెపిఎంజిలో కౌశిక్‌కి ఉద్యోగం దొరికింది. కానీ ఒక సంవత్సరం ముందు... అంటే ఆరో సెమిస్టర్‌లో ఉండగా, వీరిద్దరూ కలసి తమకిష్టమైన ప్రాజెక్టు మీద పనిచెయ్యడం మొదలుపెట్టారు. అందులోనే పూర్తిగా నిమగ్నమైపోయారు.   “నవీన్, నేను కాలేజీలో ఉన్నప్పుడు చిన్న చిన్న రోబోలు, హోవర్ క్రాఫ్ట్స్ తయారుచేసేవాళ్లం”, అంటూ తెలియజేసారు కౌశిక్. ఆ మెషిన్ల మీద పనిచేస్తున్నప్పుడే రోబోలను ఇంకా మెరుగ్గా తయారుచేసేందుకు అవసరమైన కోత భాగాల్లో ఖచ్చితత్వం ఉండాలని భావించేవారు. అందుకోసం వారికి సిఎన్‌సి అనే రౌటర్ అవసరముంది. కానీ అతిచవకైన మెషిన్ ఖరీదే ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఉంది. “మేం అంత ఖర్చు భరించలేం కాబట్టి మా స్వంత మెషిన్ తయారు చెేయాలని భావించాం. అప్పటినుండి మేము ఇక వెనుతిరిగి చూడలేదు. మా సొంత సమస్యకే మేము పరిష్కారం కనుగొనే దిశలో మా క్లైంట్లకి కూడా పరిష్కారం అందివ్వడంలో సఫలమయ్యాం”, అంటారు కౌశిక్. ఈథరల్ మెషీన్ల ఆరంభం ఇలాగ