Skip to main content

Posts

Showing posts with the label వస్తు సేవల పన్ను

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)

వస్తు, సేవల పన్ను అమల్లోకి వస్తే..   కార్యరూపం దాల్చనున్న ఏకరూప పన్ను   ఒకే దేశం... ఎన్నో రకాలైన పన్నులు ఒకే వస్తువు... వివిధ రూపాల్లో పన్నులు, పన్నులు కట్టేవారు కొందరు... ఎగ్గొట్టేవారు ఎందరో... అంతా గజిబిజి పన్నుల విధానం... పన్నుల భారం మోసే ప్రజలకు అర్ధం కాని వ్యవహారం... మనదేశంలోని పన్నుల వ్యవస్ధలో ఉన్న లోపాలివి. వీటిని సరిదిద్ది సమర్ధమైన పన్నుల వ్యవస్ధగా భావిస్తున్న ఏకరూప పన్నుల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదే  జీఎస్‌టీ. ఇది ప్రభుత్వాన్ని, వ్యాపార సంస్థలను, ప్రజలను విశేషంగా ప్రభావితం చేస్తుందని అంచనా. పలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎంతోకాలంగా ఈ తరహా ఏకీకృత పన్ను విధానం అమల్లో ఉంది. మనదేశంలోనూ ఇది అమల్లోకి రాబోతోంది. జీఎస్‌టీ అంటే ఏమిటి, దీని ప్రభావం ఎలా ఉంటుంది...? *  జీఎస్‌టీ అంటే ఏమిటి? ఎలా దీన్ని అమలు చేస్తారు?   ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలైన పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని పన్నులను విధిస్తున్నాయి. ఎన్నో రకాలైన పన్నులతో గందరగోళమైన పన్నుల విధానం అమల్లో ఉంది. వీటన్నిటి స్ధానంల