Skip to main content

Posts

Showing posts with the label ఆగ్రో ప్రాసెసింగ్

ఏపిలో నెదర్లాండ్స్ పెట్టుబడులు

 చంద్రబాబుతో సమావేశమైన నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ ఆగ్రో ప్రాసెసింగ్, ఆక్వా రంగాలపై ఆసక్తి    సిఎం చంద్రబాబుపై ప్రశంసలు విజయవాడ , అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు డచ్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ ఆధ్వర్యంలో డచ్ వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి కనబరిచారు. దీనిపై ఒక రోడ్ మ్యాప్ రూపొందించేందుకు జాయింట్ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 16 నెలల పసికూనగా ఉన్న కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా 10 రంగాలపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి ఈ బృందానికి చెప్పారు.  ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైనె్సస్, టెక్స్‌టైల్స్ అప్పారల్స్, ఎలక్ట్రానిక్స్, మినరల్ ఇండస్ట్రీ, ఎయిరోస్పేస్, ఎనర్జీ, లెదర్, పెట్రో కెమికల్స్, ఆటోమొబైల్ రంగాలలో ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. సహజ వనరులు, మానవ వనరులతోపాటు విద్యుత్, భూమి, కనెక్టివిటీలో ఏపి అగ