Skip to main content

Posts

Showing posts with the label ట్విట్టర్‌

విసిగిస్తే బ్లాక్‌ చేయండి

వాట్సప్‌లో నిమిషానికో మెసేజ్‌...ట్విట్టర్‌లో ట్వీట్లకు లెక్కేలేదు. జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే ఇన్‌బాక్స్‌లో అవసరం లేని మెయిల్సే   కనిపిస్తాయి. మరి వీటిని ఆపేదెలా? అంటే అలాంటి మెసేజ్‌లు, మెయిల్స్‌ పంపే వారిని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం.అదెలాగో తెలుసుకోవాలంటే   చదవండి....   జీమెయిల్‌లో... జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే చాలు. ఇన్‌బాక్స్‌ మొత్తం పనికిరాని మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. వాటిని రోజూ డిలీట్‌ చేయడం ఓ పెద్ద పని. పోనీ ఆ మెయిల్స్‌ రాకుండా బ్లాక్‌ చేద్దామంటే సాధ్యం కాదు. అయితే ఇప్పుడు అలాంటి మెయిల్స్‌ను ఇన్‌బాక్స్‌లోకి రాకుండా చేసుకునే సౌలభ్యం వచ్చింది. ఇందుకోసం జీమెయిల్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో సులభంగా అనవసర మెయిల్స్‌కు అడ్డుకట్ట వేసుకోవచ్చు. అప్పుడు మీ ఇన్‌బాక్స్‌లో అవసరమైన మెయిల్స్‌ మాత్రమే కనిపిస్తాయి. ఇన్‌బాక్స్‌ క్లీన్‌గా ఉంటుంది. మరి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ఇలా చేయండి.   ముందుగా జీమెయిల్‌లోకి లాగిన్‌ అవ్వండి. ఎవరి మెయిల్స్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటే వారి మెయిల్‌ను ఓపెన్‌ చేయండి. కుడివైపున ఉన్న మోర్‌ ఆప్షన్‌లోకి వె