కాంటాక్ట్స్, ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్... ఒక్కటేమిటి మొబైల్లో ఎన్నో ఫైల్స్. మరి ఆ డాటా భద్రంగా ఉండాలంటే! క్లౌడ్ స్టోరేజ్ బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌ను ఎంచుకుంటే చాలు. ఫైల్స్‌ను భద్రపరచుకోవడమే కాకుండా ఇతర డివైజ్‌ల్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ యాప్స్ విశేషాలు ఇవి... డ్రాప్‌బాక్స్ డ్రాప్‌బాక్స్ గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు. మొట్టమొదటి క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాన్ని అందించిన యాప్ ఇది. ఉచితంగా 2 జిబి స్టోరే జి సదుపాయాన్ని అందిస్తుంది. అయితే ఇతర యూజర్స్‌కు రెఫర్ చేయడం, సోషల్ మీడియా ఫాలో కావడం...వంటివి చేస్తూ 20 జిబి వరకు ఉచితంగా స్టోరేజి ఫెసిలిటీ పొందవచ్చు. ఫోన్లో లేక టాబ్లెట్‌లో నుంచే ఆఫీస్ ఫైల్స్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా అప్డేట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అటాచ్మెంట్ లేకుండా లార్జ్ఫైల్స్ను పంపుకోవచ్చు. వన్‌డ్రైవ్ మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తున్న యాప్ ఇది. వర్క్, పర్సనల్ లైఫ్‌కు ఒకే ప్లేస్‌లో పరిష్కారం చూపిస్తుంది. ‘వన్‌డ్రైవ్’ స్టోరేజ్ సమస్యలకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుక
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH