Skip to main content

Posts

Showing posts with the label milk dairy

క్షీర సామ్రాజ్యం!

రూ.వందల కోట్ల విలువైన పాల ఉత్పత్తి సంస్థను నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళలు 2,279 గ్రామాల నుంచి సేకరణ 94 పాల శీతలీకరణ కేంద్రాలు, రూ.175 కోట్ల చెల్లింపులు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సేవలు వారంతా సాధారణ మహిళలే. చేయీ చేయీ కలిపారు. క్షీరసాగరాన్ని మధించే స్థాయికి ఎదిగారు. గ్రామాల్లో పాల సేకరణతో వందల మందికి ఉపాధిని కల్పిస్తూ దిల్లీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఇంటిని చక్కబెట్టినంత తేలిగ్గా.. సంస్థను నడిపిస్తూ సరికొత్త పాలవెల్లువను సృష్టిస్తున్నారు. ఒకటి రెండు కాదు.. రెండు వేల గ్రామాల్లో.. రోజూ మూడు లక్షల లీటర్ల పాలను సేకరించి సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ఏమాత్రం తేడా లేకుండా.. అంతా పక్కాగా నడిపిస్తున్నారు. వీరి క్షీర సామ్రాజ్యాన్ని పరిశీలిస్తే ఎంతవారైనా ఔరా..! అనకమానరు. ఆ మహిళలు ఎక్కడి వారో కాదు. మన తెలుగువారే. అనంత, చిత్తూరు జిల్లాలకు చెందిన ఆడపచులే. దేశంలోనే పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తి మండలిపై ప్రత్యేక కథనం. రెండు వేల గ్రామాలు... 94 పాల శీతలీకరణ కేంద్రాలు.. రోజుకు 3 లక్షల లీటర్ల సేకరణ.. దిల్లీకీ సరఫరా.. ఇదంతా సజావుగా సాగుతుందంటే దానివెనుక ప్రభుత్వ యంత్రాంగమో.