Skip to main content

Posts

Showing posts with the label VISA Rules

వీసా రూల్స్‌ను అతిక్రమించవద్దు

అమెరికాలో మొత్తం 4500 పైగా యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో చేరే విద్యార్థులు ముందుగా పరిశోధన చేసి ప్రామాణికమైన యూనివర్సిటీలను ఎంచుకోవాలి. అంతేకాదు చదువుకోవడానికి అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థులు వీసా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించ వద్దని చెబుతున్నారు ఎడ్యుకేషన యూఎ్‌సఏ నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ రేణుక రాజారావు. హైదరాబాద్‌లోని రీజనల్‌ కో- ఆర్డినేటర్‌ పియా బహదూర్‌తో కలిసి హైదరాబాద్‌ బేగంపేటలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలోని ‘అమెరికన్ కార్నర్‌’లో గురువారం విలేకరులతో మాట్లాడారు.   భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగువాళ్ళు నెల రోజులుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు. ఉద్యోగం చేస్తూ చదువుకోవడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. ఉద్యోగాలు చేసినా దాని ద్వారా వచ్చే డబ్బు ఫీజులు, వసతులకు అయ్యే ఖర్చులకు సరిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి వారాని కి అత్యధికంగా 20 గంటలు పని చేయడానికి అనుమతి ఉంటుంది. అందరికీ 20 గంటల అనుమతి దొరకదు. అదీ యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ పనులకు పెద్దగా ఆదాయం ఉండదు. అందుకే విద్యార్థులు ఈ భావం నుంచి బయటపడాలన్నా