Skip to main content

Posts

Showing posts with the label అదానీ

నమస్తే...బాస్‌!

ఎవరి శైలి వారిది. ఎవరి ప్రత్యేకతలు వారివి. ఒక బాసు బాకులా పదునుగా వ్యవహరిస్తాడు. ఒక బాసు కేకులా తీయగా మాట్లాడతాడు. ఒకరు పట్టిందల్లా బంగారమైతే, మరొకరు ఏకంగా బంగారాన్నే పట్టేసుకోగలరు. నేర్చుకునే మనసుంటే - ప్రతి బాసూ ఓ గెలుపు పాఠమే! అక్టోబరు 16, ప్రపంచ బాసుల దినోత్సవం. ఆ సందర్భంగా ఉత్తమ బాసుల్ని గుర్తుచేసుకుంటూ, బాసోత్తములకు ‘హ్యాపీ బాస్‌ డే!’ చెబుతూ...  ఆ తీక్షణమైన చూపుల వెనుక, ఎవరూ గమనించని అంతర్‌ దృష్టి ఒకటుంటుంది. ఆ నిటారు నడకను చూస్తే గురితప్పని బాణమేదో స్ఫురణకు వస్తుంది. విజయాలకు పొంగిపోనీ అపజయాలకు కుంగిపోనీ ఆ సహజ గాంభీర్యం గీతాచార్యుడి స్థితప్రజ్ఞుడిని కళ్లముందు నిలుపుతుంది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ఆ ‘క్వశ్చన్‌ బ్యాంకు’ మనస్తత్వంలో అంతులేని జిజ్ఞాసా ఓ భాగమే. అంతర్ముఖుడేమో అనుకుంటాం కానీ, ఓ బలమైన వ్యవస్థను సృష్టించడంలో అచ్చంగా చతుర్ముఖుడే! ఆ ఫుల్‌సూట్‌, అతనో పరిపూర్ణ వ్యక్తి అన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఫైళ్ల బరువుతో ఓపక్కకి వాలినట్టున్న భుజం...కీలక బాధ్యతలు మోస్తున్నాడనడానికి బండగుర్తు. అలవోకగా ఉటంకించే మేనేజ్‌మెంట్‌ సూక్తులు అతన్లోని చదువరిని పట్టిస్తాయి. ప