Skip to main content

Posts

Showing posts with the label అమరావతి

పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోంది : బాబు

న్యూఢిల్లీ : భవిష్యత్‌లో నగరాలు ఎలా ఉండాలన్నదానికి నమూనాగా ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొన్న ఆయన కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోందని అన్నారు. అయితే జీడీపీలో అత్యధిక భాగం పట్టణాల నుంచే వస్తోందని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్‌ సబ్‌గ్రూప్‌ కన్వీనర్‌గా పట్టణాభివృద్ధికి కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశామని చంద్రబాబు వివరించారు.  ఘన వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అందులో ఒకటని చంద్రబాబు వెల్లడించారు. సదస్సులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. లులూ గ్రూప్‌ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో రూ. 15 వందల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్స్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు లులూ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఏపీలో పర్యటించి పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ ఆలీని సీఎం చంద్రబాబు కోరారు. -ఆజ్యో 

శుభమస్తు!

వేలయు లేని యంబునిధి వేగమునన్‌ జనునాంధర సైన్య జం   ఘాలత మందగించె క్షణకాలము మాత్రమ యాంధ్రవిశ్వవి   ద్యాలయ మిచ్చు స్వాగతము నందుటకై యమరావతీపురిన్‌   బాలకవుల్‌ పఠించు జయపద్యములన్‌ విని మెచ్చుకొంటకున్‌   ధాన్యకటక దుర్గము నుంచి దండయాత్రికుడై గౌతమీపుత్ర శాతకర్ణి బయలువెడలినప్పుడు, కూతవేటు దూరంలోనే ఉన్న అమరావతీ పట్టణంలో ఆంధ్రవిశ్వవిద్యాలయ బాలకవులు స్వాగతపూర్వకంగా చెప్పే జయపద్యాలను వినడానికి సేనల వేగం కొద్దిగా మందగించిందట. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రశస్తిలోని ఆణిముత్యం ఈ పద్యం. నాసిక్‌ దగ్గర ఏదో గుహలో దొరికిన శాసనం వల్ల శాతవాహనులకు ఒక దశలో రాజధానిగా ధాన్యకటకం (ధరణికోట) ఉన్నదని తెలిసింది. దానితో జాతీయోద్యమ కాలంలోనూ, ఆంధ్రోద్యమ కాలంలోనూ తెలుగువారి ఘనకీర్తి గొప్ప స్ఫూర్తిదాయకమైంది. దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత తిరిగి తెలుగువారి ఒక రాజధానిగా అదే ప్రాంతం నేడు ఆవిష్కృతం కానున్నది. నూతన రాజధాని అమరావతి పరిధిలో పాత అమరావతి గ్రామం లేకపోయి ఉండవచ్చు. శాతవాహనుల రాజధాని అమరావతి కాక, దానికి సుమారు కిలోమీటరు దూరంలోని ధరణి కోట అయి ఉండవచ్చు. కానీ, ఆ ప్రాంతం అంతా కలగలసిపోయి ఒక చారిత్రక ఆ

రాజధానులకే మణిపూస!

దేశవిదేశాల్లోని ప్రణాళికాబద్ధ నగరాల పరిశీలన   ఇతర రాష్ట్రాల, దేశాల ముఖ్యపట్టణాల అనుభవాల నుంచి పాఠాలు   వాటన్నిటికంటే మిన్నగా నిర్మించాలని సంకల్పం   ఏపీ రాజధాని అమరావతి 21వ శతాబ్దంలో అందరి దృష్టినీ ఆకర్షించనుంది. వందేళ్ల ముందుచూపుతో, పకడ్బందీ వ్యూహాలతో అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. ఇందుకోసం ఇప్పటికే దేశవిదేశాల్లోని పలు నగరాల ప్రణాళికలను పరిశీలించారు. వాటిలోని మంచిచెడులు.. లాభనష్టాలను బేరీజు వేశారు. మరోవైపు చిన్న దేశాలైన కజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ రాజధానుల్లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. సోవియట్‌ యూనియన్‌ నుంచి వేరుపడిన ఆయా దేశాలు సాధించిన అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు ఆకట్టుకోవడంతో వాటినీ పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆధునిక నిర్మాణ మెలకువలు, అందుబాటులోని వనరుల ఆలంబన, మౌలిక సదుపాయాల కల్పన, పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సాగుతోంది. ఇందుకోసం సమకాలీన భారతంలో నిర్మితమైన నగరాలు, రాజధానులు ఎదుర్కొ