Skip to main content

Posts

Showing posts with the label ఉద్యోగం

2016 భవిష్యత్తు వీటిదే!

డిమాండ్‌ ఉండే రంగాలను ఎంచుకుంటే జాబ్‌ సాధించడం సులువవుతుంది. అలా కాకుండా ఉద్యోగాల్లో గ్రోత్ లేని రంగాన్ని ఎంచుకుంటే జాబ్‌ సాధించడం కాస్త కష్టమవుతుంది. అందుకే కోర్సు ఎంపిక చేసుకునే సమయంలోనే ఏయే రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని అంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే చదవండి.  కొత్త ఏడాదిలో ఏ ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంటుంది? ఏ కోర్సు చదివితే ఉపయోగకరంగా ఉంటుంది? జీతం ఏయే రంగాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రతి విద్యార్థికి వస్తుంటాయి.   సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్స్‌ అర్హత :  సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంట్రీలెవెల్‌లో చేరాలనుకునే వారికి ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవసరం. ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఐటీరంగం ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. రాబోయే పదేళ్లలో ఈ రంగంలో ఉదోగ్యాల పెరుగుదల 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా జీతం కూడా ఎక్కువే. పాతిక వేల జీతంతో ఉద్యోగం ప్రారంభించాలనుకునే వారికి ఐటీసెక్టర్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. ప్రతిచోటా, ప్రతిపనిలోనూ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్

ఉద్యోగం బోర్‌ కొడుతోందా?

చేస్తున్న ఉద్యోగం బోర్‌ కొడుతోందని మరో ఉద్యోగం మారడం తప్పు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు కొంత సంయమనం పాటించక తప్పదు.  మీ మానసిక భావనకు మూలాలను వెదికే ప్రయత్నం చేయండి. కారణం తెలుసుకోండి.   బహుశా బాస్‌తో మీకు పడటం లేదనో, కంపెనీ మీ శ్రమను గుర్తించలేదనో, ఆశించిన వేతన ఫలాలు అందడం లేదనో ఫిర్యాదులు మీకుంటే వాటిని కాసేపు పక్కన పెట్టి.. మీ వైపు నుంచి మిమ్మల్ని పరీక్షించుకోండి.   ఉద్యోగంలో చేరిన మొదట్లో చూపిన చొరవను ఇప్పుడు చూపిస్తున్నారా? బాధ్యతలను అందిపుచ్చుకుంటున్నారా? పనిని మరింత నైపుణ్యంగా, వైవిధ్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? పునరాలోచించుకునే సమయం వచ్చిందేమో అవలోకించండి.  ఏ కంపెనీలో అయినా, ఏ ఉద్యోగంలో అయినా ప్రస్తుత సంస్థలో ఉన్నట్లే ఉంటుందన్న సంగతి మరిచిపోకండి. సమస్య ఏదైనా ఉందంటే అది మీలోనే ఉండి ఉండవచ్చు. ఆ దిశగా మీకు మీరే సద్విమర్శ చేసుకుంటే మంచిదేమో ఆలోచించండి.   రొటీన్‌కు భిన్నంగా ఆలోచించగలిగే తత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా ఉద్యోగం బోర్‌ కొట్టవచ్చు. కేవలం మీకు అప్పగించిన పనిని పనిగా కాకుండా వైవిధ్యభరితంగా చేస్తున్నారా లేదా సమీక్షించుకోండి.   అనుభవం గ