Skip to main content

Posts

Showing posts with the label Public Issues

ఐపిఒలతో జాగ్రత్త

ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపిఒ)ల సందడి ప్రారంభమైంది. 2014లో 1,468 కంపెనీలు మాత్రమే నిధుల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. 2015లో ఈ సంఖ్య అమాంతం 13,862 కంపెనీలకు పెరిగింది. సమీకరించిన నిధుల మొత్తం కూడా రూ.68,608 కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఇంత పెద్ద మొత్తం సమీకరించడం ఇదే మొదటి సారి. పదేళ్ల కాలానికి చూస్తే ఇంత మొత్తం సమీకరించడం ఇది రెండో సారి. 2016లో కూడా ఐపిఒ మార్కెట్‌లో సందడి కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రూ.7,315 కోట్ల సమీకరణకు 20 కంపెనీలు ఇప్పటికే సెబి నుంచి అనుమతి పొందాయి. మరో 11 కంపెనీలు రూ.5,445 కోట్ల సమీకరణ కోసం సెబి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలో మరిన్ని కంపెనీలు ఐపిఒల కోసం సెబి దగ్గర తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ సమర్పిస్తాయని అంచనా. ఇవన్నీ చూసి మార్కెట్‌కు వచ్చే ఐపిఒల్లో గుడ్డిగా ఇన్వెస్ట్‌ చేస్తే చేతులు కాలడం ఖాయం. కింది జాగ్రత్తలు పాటించడం ద్వారా అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.  వేలం వెర్రి వద్దు   చాలా మంది వేలం వెర్రిగా మార్కెట్‌కు వచ్చిన ప్రతి ఐపిఒకి దరఖాస్తు చేసి చేతులు కాల్చుకుంటుంటారు.