Skip to main content

Posts

Showing posts with the label స్టాక్ మార్కెట్

సెన్సెక్స్‌కు ఫెడరల్‌ కిక్‌

565 పాయింట్ల ర్యాలీ.. నాలుగు సెషన్లలో 1169 పాయింట్లు అప్‌ ముంబై :  సర్వత్రా ఉత్సాహపూరితమైన వాతావరణంలో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం పరుగులు తీసింది. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకు అమెరికాలో ఉద్యోగాల వృద్ధి నిరాశాపూరితంగా ఉన్నందు వల్ల వడ్డీ రేట్ల పెంపును అమెరికన్‌ ఫెడరల్‌ మరి కొంత కాలం వాయిదా వేస్తుందన్న వార్తలు మార్కెట్‌కు ఇంధనంగా నిలిచాయి. దీనికి తోడు మరిన్ని బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించడం, ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపా యి నిలదొక్కుకోవడం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలేవీ వెలువడకపోవడం వల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడింది. మొత్తం మీద సెన్సెక్స్‌ 564.70 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి 15 తర్వాత సెన్సెక్స్‌ ఒక సెషన్‌లో సాధించిన అతిపెద్ద ర్యాలీ ఇది. గత మంగళవారం ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించిన ఉత్సాహంలో సెన్సెక్స్‌ నాలుగు వరుస ట్రేడింగ్‌ సెషన్లలో 1168.71 పాయింట్ల ర్యాలీ సాధించింది. ఉదయం నుంచి పురోగమన పథంలోనే ట్రేడవుతూ వచ్చిన సెన్సెక్స్‌ ఒక దశలో 26,822.42 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 564.60 పాయింట్ల