Skip to main content

Posts

Showing posts with the label ప్రపంచ ఆర్థిక సదస్సు

పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోంది : బాబు

న్యూఢిల్లీ : భవిష్యత్‌లో నగరాలు ఎలా ఉండాలన్నదానికి నమూనాగా ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొన్న ఆయన కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోందని అన్నారు. అయితే జీడీపీలో అత్యధిక భాగం పట్టణాల నుంచే వస్తోందని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్‌ సబ్‌గ్రూప్‌ కన్వీనర్‌గా పట్టణాభివృద్ధికి కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశామని చంద్రబాబు వివరించారు.  ఘన వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అందులో ఒకటని చంద్రబాబు వెల్లడించారు. సదస్సులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. లులూ గ్రూప్‌ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో రూ. 15 వందల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్స్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు లులూ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఏపీలో పర్యటించి పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ ఆలీని సీఎం చంద్రబాబు కోరారు. -ఆజ్యో