Skip to main content

Posts

Showing posts with the label పాస్‌పోర్టు

2015 నవంబర్ 25 నుంచి చేతిరాత పాస్‌పోర్టు చెల్లదు

దేశంలో మిషన్ రీడబుల్ పాస్‌పోర్టును కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ 2001 నుంచి జారీ చేస్తుంది. దీని గడువు 10ఏళ్ల వరకు ఉంటుంది. అంతకు ముందు జారీ చేసిన పాస్‌పోర్టులు చేతి రాతతో, ఫోటోలు అతికించి జారీ చేసేవారు. ఇవి 20 ఏళ్ల వరకు చెల్లుబాటు ఉంటాయి. గత ఏడాది నవంబర్ వరకు దేశంలో ఆరుకోట్ల పాస్‌పోర్టులు ఉండగా అందులో రెండుకోట్ల 86లక్షల నాన్ మిషన్ రీడబుల్ పాస్‌పోర్టులు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. నవంబర్ 24 నుంచి 2001 కంటే ముందు జారీ చేసిన పాస్‌పోర్టులు చెల్లవని అంతర్జాతీయ విమానయాన సంస్థ తేల్చి చెప్పింది. ఈ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001 కంటే ముందు పాస్‌పోర్టు పొందిన వారు మళ్లీ( రీ ఇష్యూ) జారీ చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సూచించింది. దీని కోసం వచ్చే నెల 24 లోపు 2001 కంటే ముందు పాస్‌పోర్టు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. చేతి రాత కలిగి ఉండి, 2001 కంటే ముందు జారీ చేసిన పాస్‌పోర్టు కలిగి విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వీరు కూడా రెన్యువల్ చేయించుకోవాలి