Skip to main content

Posts

Showing posts with the label సౌర విద్యుత్

10వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... 2018 కల్లా రాష్ట్రంలో 10వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమని తెలిపారు. సౌర, పవన విద్యుత్‌ రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని... సౌర, పవన విద్యుత్‌ ఒకే ప్రాంతంలో ఉత్పత్తయ్యేలా పరిజ్ఞానం రూపొందించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో ఎనన్జీ యూనివర్శిటీ ఏర్పాటుకు సుజలాన్‌, హీరో కంపెనీలు రూ.50కోట్లు విరాళం ఇచ్చాయి.

భారత్‌-జర్మనీ సుదృఢ బంధం

భారత్‌లో సౌర విద్యుత్‌కు 100 కోట్ల యూరోలకు పైగా జర్మనీ సాయం ఇరు దేశాల మధ్య 18 ఒప్పందాలు మోదీ, మెర్కెల్‌ సుదీర్ఘ చర్చలు భారత్‌ను ఆర్థికంగా పరివర్తన చేయాలన్న మా సంకల్పానికి జర్మనీ సహజ భాగస్వామి అవుతుందనుకుంటున్నా. జర్మనీ సామర్థ్యాలు, భారత ప్రాధాన్యతలకు జోడీ కుదిరింది. ఆర్థిక సంబంధాల బలోపేతం పైనే మాదృష్టంతా. అంతులేని సవాళ్లు, విస్తృత అవకాశాలకు కొదవలేని ఈ రోజుల్లో... మరింత మానవీయ, శాంతియుత, సుస్థిర ప్రపంచ నిర్మాణంలో భారత్‌-జర్మనీలు సుదృఢ భాగస్వాములుగా ముందడుగు వేస్తాయని విశ్వసిస్తున్నా -నరేంద్ర మోదీ వివిధ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ వేగం అద్భుతం. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సౌరవిద్యుత్‌ రంగాలకు సంబంధించి ఇరు దేశాలూ అనేక నిర్ణయాలు తీసుకున్నాయి - ఏంజెలా మెర్కెల్‌ భారత్‌-జర్మనీ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రక్షణ ఉత్పత్తులు, వాణిజ్యం, భద్రత, నిఘా, రైల్వేలు, పరిశుద్ధ ఇంధనం...లాంటి కీలక రంగాల్లో తమ మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా 18 అవగాహన ఒప్పందాల(ఎం