Skip to main content

Posts

Showing posts with the label జీడిపి

భారతదేశం అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకోగలదు

అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకోగలదు 2017-18 కల్లా 8 శాతానికి జీడీపీ ఎగుమతులు బలహీనంగా ఉన్నా సరే ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుంది ప్రపంచ బ్యాంకు అంచనాలు (వాషింగ్టన్‌) అంతర్జాతీయ అనిశ్చితులను సమర్థంగా తట్టుకునే సత్తా భారత్‌కు ఉందని ప్రపంచ బ్యాంకు కితాబునిచ్చింది. సంస్కరణలను వేగవంతంగా అమలు చేయగల అవకాశాలు ఉండడం ఇందుకు కారణంగా చూపింది. ఎగుమతుల్లో వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతంగా నమోదుకాగలదని అంచనా వేసింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం భారతేనని ‘సౌత్‌ ఏషియా ఎకనామిక్‌ ఫోకస్‌ ఫాల్‌ 2015’ నివేదికలో వెల్లడించింది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే.. * 2017-18 కల్లా భారత్‌ 8 శాతం వృద్ధిని సాధిస్తుంది. * నిన్నమొన్నటి దాకా అత్యధిక వృద్ధితో ఉన్న చైనా క్రమంగా తక్కువ స్థాయి వృద్ధిలోకి జారిపోతున్న క్రమంలో భారత్‌.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. * పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల్లో మెరుగుదల కనిపిస్తుండడంతో.. భారత్‌ సరైన వృద్ధి బాటలో పయనిస్తోంది. * 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కాగా.. ప్రస్తుత ఆ