Skip to main content

Posts

Showing posts with the label థీల్‌ ఫెలోషిప్‌

కాలేజ్‌ డ్రాపవుట్‌... కానీ నాటౌట్‌!

గ్రాడ్యుయేషన్‌ గౌను తొడుక్కోవాలన్న కోరిక ఉండదు. స్టేజీ మీద పట్టా కాగితం పుచ్చుకుంటూ ఫొటో తీయించుకోవాలన్న ఆరాటం కనిపించదు. పేరుపక్కన మూడక్షరాలు చూసుకోవాలన్న ముచ్చటే లేదు. ఒకటే లక్ష్యం - వ్యాపారాన్ని ప్రారంభించడం. ‘స్టార్టప్‌’ వీరుల్లో ‘డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌’ చాలామందే ఉన్నారు. క్యాం పస్‌ క్యాంటీన్‌ -   ‘ఉస్తాద్‌! తీన్‌ చాయ్‌’ మొదటివాడి ఆర్డరు.  ‘చార్‌ సమోసా..గరమ్‌’ రెండోవాడి జోడింపు.  ‘కూల్‌డ్రింక్‌ పిలావో యార్‌’ మూడోవాడి ముచ్చట.  ‘రేయ్‌, మనం బిజినెస్‌ గురించి మాట్లాడుకోడానికొచ్చామా, తిని తేన్చడానికొచ్చామా! ఇడియట్స్‌’ - నాలుగోవాడి గద్దింపు.  ‘ఓకే ఓకే. సబ్జెక్ట్‌లోకి వద్దాం...’ మొదటివాడే మళ్లీ అందుకున్నాడు. తనే సమన్వయ బాధ్యతా తీసుకున్నాడు.  ‘ఐడియా’ అనగానే...  ‘సిద్ధంగా ఉంది’ అని జవాబిచ్చారంతా.  ‘పెట్టుబడి’ మాట పూర్తికాకముందే...  ‘వాడి మమ్మీడాడీ సరేనన్నారు. నాకైతే పార్ట్‌టైమ్‌ జాబ్‌ సేవింగ్స్‌ ఉన్నాయి. వీడెక్కడో అప్పుచేస్తున్నాడనుకుంటా...’ అందరి తరఫునా ఒకడే వకాల్తా పుచ్చుకున్నాడు.  ‘ఇంకేమిటి సమస్య’...  ‘క్యాంపస్‌! అదే పెద్ద సమస్య. ప్రాజెక్టులూ అస