Skip to main content

Posts

Showing posts with the label ఎల్‌ఈడీ

5,000 ఎకరాల్లో 20 క్లస్టర్లు జోరుగా మొబైల్‌, ఎల్‌ఈడీ, ఫొటోవోల్టాయిక్‌, ఆటో ఎలక్ట్రానిక్స్‌ తయారీ

పురోగమన పథంలో ‘ఎలక్ట్రానిక్స్‌’  ఏడాదిలో రూ.లక్ష కోట్ల ప్రతిపాదనలు  5,000 ఎకరాల్లో 20 క్లస్టర్లు  జోరుగా మొబైల్‌, ఎల్‌ఈడీ, ఫొటోవోల్టాయిక్‌, ఆటో ఎలక్ట్రానిక్స్‌ తయారీ   దేశీయ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు దశ తిరగనుంది. గత ఏడాదిన్నర కాలంలో దేశీయంగా వచ్చిన విధానపర మార్పులు, చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వివిధ సానుకూల అంశాలతో రానున్న కొద్ది సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు పెరగనున్న గిరాకీ.. దేశీయ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమను కొత్త పథంలోకి తీసుకువెళ్లనున్నాయి. దేశంలో ‘పురోగమిస్తున్న పరిశ్రమ’ (సన్‌రైజింగ్‌ పరిశ్రమ)గా ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ కొనసాగనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలు, ప్రోత్సాహకాల ద్వారా పరిశ్రమకు వూతమిస్తున్నప్పటికీ.. పెరిగే గిరాకీని అందుకోవడానికి ఈ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంటున్నాయి. ఇంకా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.  గత ఏడాది కాలంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో పెట్టుబడులకు వివిధ కంపెనీల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా ప్రతిపాదనలు వచ్చాయి. మార్పులు చే