Skip to main content

Posts

Showing posts with the label దక్షిణ కొరియా

ఏపితో వర్తక సంబంధాలకు దక్షిణ కొరియా ఆసక్తి

విశాఖపట్నం:-  ఆంధ్రప్రదేశ్‌తో వర్తక, వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు దక్షిణ కొరియా ముందుకు వచ్చింది. కొరియా ట్రేడ్ సెంటర్‌కు చెందిన బృందం బుధవారం విశాఖ పోర్టును సందర్శించింది. కొరియా ట్రేడ్ సెంటర్ డైరెక్టర్, ఎంబసీ మిన్‌జూన్ పార్క్ నేతృత్వంలో ట్రేడ్ సెంటర్‌కు చెందిన కంగ్‌సుక్ జంగ్, దౌన్ జంగ్ బృందం విశాఖ పోర్టులో పర్యటించింది. వీరికి పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ హరనాథ్ స్వాగతం పలికారు. పోర్టు విస్తరణ పనులను పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు కొరియా బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కొరియా ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో వర్తక, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. కోస్తా తీరంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. తరువాత డిప్యూటీ చైర్మన్ హరనాథ్‌తో కొరియా బృందం సమావేశమైంది. విశాఖ పోర్టులో ఉన్న వౌలిక సదుపాయాలను కొరియా బృందానికి ఆయన తెలియచేశారు. ఇప్పటికే భారత్, కొరియాల మధ్య అన్ని విధాలా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, వర్తక, వాణిజ్యాన్ని మరింత అభివృద్ధి చేసి, ఇరు దేశాల బంధాన్ని పెంచాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని కొరియా ప్రతినిధులు