Skip to main content

Posts

Showing posts with the label చంద్రబాబు నాయుడు

పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోంది : బాబు

న్యూఢిల్లీ : భవిష్యత్‌లో నగరాలు ఎలా ఉండాలన్నదానికి నమూనాగా ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొన్న ఆయన కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోందని అన్నారు. అయితే జీడీపీలో అత్యధిక భాగం పట్టణాల నుంచే వస్తోందని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్‌ సబ్‌గ్రూప్‌ కన్వీనర్‌గా పట్టణాభివృద్ధికి కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశామని చంద్రబాబు వివరించారు.  ఘన వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అందులో ఒకటని చంద్రబాబు వెల్లడించారు. సదస్సులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. లులూ గ్రూప్‌ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో రూ. 15 వందల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్స్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు లులూ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఏపీలో పర్యటించి పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ ఆలీని సీఎం చంద్రబాబు కోరారు. -ఆజ్యో 

టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ!

న్యూఢిల్లీ:  జపాన్‌లోని టొయోమా నగరంలోని వివిధ కట్టడాలు, పలు రంగాలకు చెందిన పరిశ్రమలను ఏపీలోనూ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం టొయోమా నగరానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల చంద్రబాబు జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఏపీ-టొయోమా సోదర రాష్ట్రాలుగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జపాన్‌ ప్రతినిధి బృందం చంద్రబాబుతో సమావేశమైంది. ఆ నగరంలో ఏమేమి ఉన్నాయో ఏపీలో వాటిని ఏర్పాటు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. అక్కడ ఏమేమి టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ! ఉన్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. టూరిజం, ఫార్మా సిటీలు, స్పెషల్‌ పర్పస్‌ మిషన్‌ల ఏర్పాటుకు వారు మొగ్గు చూపారు. వీటికి సంబంధించి జపాన్‌ బృందం గురువారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పర్యటిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి జపాన్‌ ప్రధానికి ఆ బృందం నివేదిక అందించనుంది. అనంతరం దీనిపై అక్కడి పార్లమెంటులో చర్చిస్తామని ఆ బృందం చంద్రబాబుకు తెలిపింది. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుసుకుంటామని హామీ

ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌కు ప్రోత్సాహం

త్వరలో నియంత్రణ చట్టాల్లో  మార్పులు: సిఎం చంద్రబాబు న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి):  ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎపి-తెలంగాణల్లో ప్రత్యక్ష అమ్మకాలపై రూపొందించిన నివేదికను సమర్పించేందుకు ఆంధ్రా భవన్‌లో తనను కలిసిన ఫిక్కీ ప్రతినిధి వర్గానికి సిఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించేందుకు నియంత్రణ వ్యవస్థల్లో సైతం మార్పులు చేస్తామన్నారు. ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌ డ్వాక్రా మహిళలకు ఉపయోగపడుతుందన్నారు. సరైన చర్యలు తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నాటికి 8 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి కల్పించవచ్చని ఫిక్కీ ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రికి వివరించింది. దీని వలన ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపింది. ప్రత్యక్షంగా విక్రయించే ఉత్పత్తుల్లో 30 శాతం మాత్రమే దిగుమతి సరుకులని, మిగతా 70 శాతం ఉత్పత్తులు దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఉత్పత్తవుతున్నాయని వెల్లడించింది. చట్టాన్ని సవరించాలి: సేన్‌  ప్రత్యక్ష విక్రయాల ద్వారా మహిళా సాధికారత