Skip to main content

Posts

Showing posts with the label పవన శక్తి

సౌర కాంతి.. పవన శక్తి : ఆంధ్రప్రదేశ్‌లో 2018-19 నాటికి పది వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

2018-19 నాటికి పది వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి  విజయవాడలో కుదిరిన రూ.19 వేల కోట్ల విలువైన ఒప్పందాలు  పెట్టుబడులకు ఇదే తరుణం.. ఎగుమతులకూ అవకాశం: సీఎం చంద్రబాబు  ఆం ధ్రప్రదేశ్‌లో 2018-19 నాటికి పది వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పత్తి సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన ఎస్‌బీ సోలార్‌ సర్వీసెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ, స్పెయిన్‌కు చెందిన సుజలాన్‌ ఎనర్జీ, అక్సియానా ఎనర్జీ కంపెనీలు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో గురువారం రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీల ప్రతినిధులు, నెడ్‌క్యాప్‌ ఎండీ కమలాకర్‌బాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యుత్తు రంగంలో తాము చేపట్టిన సంస్కరణలకు కొనసాగింపుగా పర్యావరణానికి హాని కలిగించని సౌర, పవన విద్యుదుత్పత్తిని