Skip to main content

Posts

Showing posts with the label ADB

తీరప్రాంతమే ఆంధ్రాకు అదృష్ట రేఖ: ఎడిబి కంట్రీ డైరెక్టర్‌ టెరెసా కో

పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్‌-చెన్నై కారిడార్‌  విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి):  వైజాగ్‌-చెన్నై ఇండసి్ట్రయల్‌ కారిడార్‌తో ఆంధ్రప్రదేశ్‌ రూపు రేఖలు మారిపోతాయని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) ఇండియా కంట్రీ డైరెక్టర్‌ టెరెసా కో అన్నారు. సోమవారంనాడిక్కడ సిఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో ఈ కారిడార్‌ అత్యంత కీలకంగా ఉండనుందని తెలిపారు. 85 కోట్ల డాలర్ల (సుమారు 6,000 కోట్ల రూపాయలు) విలువైన వైజాగ్‌- చెన్నై ఇండసి్ట్రయల్‌ కారి డార్‌.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు గల ఆంధ్రప్రదేశ్‌ తీర ముఖ చిత్రాన్ని మార్చివేయనుందని అన్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌లో ఉన్న జిల్లాల స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కేవలం 2 లక్షల రూపాయలుగా ఉందని, కారిడార్‌ కార్య రూపం దాలిస్తే 2035 నాటికి వీటి జిడిపి ఏకంగా 11,60,000 రూపాయలకు చేరుకుంటుందని ఆమె వివరించారు. అంతే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగు తాయని థెరీసా పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ కారిడార్‌లోని జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకత సామర్థ్యం ఏకంగా ఏడు రెట్లు వృద్ధి చెందుతుందని అన