Skip to main content

Posts

Showing posts with the label BodhaGuru

ఫేస్‌బుక్‌ పోటీలో కోటిన్నర గెలిచాం!

మీ.. మా.. మన... వూసులన్నింటికీ ఆన్‌లైన్‌ వేదికనిచ్చే ఫేస్‌బుక్‌ ఆ మధ్య ఓ పోటీ ప్రకటించింది. భారత్‌లోని స్త్రీలకీ, విద్యార్థులకీ, రైతులకీ, వలస కూలీలకీ అంతర్జాలాన్ని చేరువ చేసేలా ‘కొత్తగా మీరేం సృష్టిస్తారు..’ అంటూ సవాలు విసిరింది. ఆ పోటీలో విద్యార్థి విభాగంలో హైదరాబాద్‌కి చెందిన స్టార్టప్‌ ‘బోధ గురు’ మేటిగా నిలిచింది! చిన్నారుల కోసం రెండు కొత్త యాప్‌లు సృష్టించినందుగ్గాను 1.62 కోట్ల రూపాయల్ని బహుమతిగా అందుకుంది. ‘అంతకొత్తగా ఏం చేశారో..?’ అంటూ బోధగురు సైట్‌కి వెళితే కంట్లోపడ్డ తొలి నినాదం ఇది.. ‘దేశంలోని ప్రతి నిరుపేద చిన్నారికీ సాంకేతికతనిస్తాం’ అని! ఆ లక్ష్యసాధన కోసం గత నాలుగున్నరేళ్లుగా పడ్డ శ్రమని ఇలా చెప్పారు సంస్థ సహవ్యవస్థాపకురాలు అనుభా జైన్‌.  హాయ్‌, ముందు మాకు అవార్డు తెచ్చిపెట్టిన జంట యాప్‌ల గురించి చెప్పేస్తాను. క్రియేటర్‌ యాప్‌, రీడర్‌ యాప్‌ అన్నవి వాటి పేర్లు. పిల్లల మనసు ఎన్నెన్నో వూహలతో నిండి ఉంటుంది. మనదగ్గరా, టీచర్‌ దగ్గరా విన్న కథలన్నింటినీ వాళ్లు తమదైన శైలిలో మార్చుకుంటారు. లేకపోతే కొత్తగా సృష్టించుకుంటారు. ఆ వూహలకి ఓ రూపమివ్వాలనే ప్రయత్నమే ‘క్రియేటర్‌ యాప్‌’.