Skip to main content

Posts

Showing posts with the label ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌ రూ.3,100 కోట్ల పెట్టుబడి

4 జి , 3 జి సేవల విస్తరణపై దృష్టి   రెండో త్రైమాసిక లాభం రూ .1,523 కోట్లు   ఆదుకున్న డేటా ఆదాయం   రూ .70,777 కోట్లకు చేరిన అప్పులు   న్యూఢిల్లీ:  4జి టెలికాం సేవలతోపాటు 3జి సేవల విస్తరణ కోసం భారతి ఎయిర్‌టెల్‌ మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3,101.5 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గోపాల్‌ విఠల్‌ ఈ విషయం చెప్పారు. ఇందులో ఎక్కువ భాగాన్ని కంపెనీ డేటా సామర్ధ్యం విస్తరణ కోసం కేటాయించింది. 2015 సెప్టెంబర్‌ చివరినాటికి కంపెనీ నికర అప్పుల భారం రూ.70,777 కోట్లుగా ఉంది. అంచనాలు మించిన లాభం  సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను మించాయి. ఈ కాలానికి కంపెనీ రూ.23,836 కోట్ల స్థూల ఆదాయంపై రూ.1,523 కోట్ల సమీకృత నికర లాభం ఆర్జించింది. నికర లాభంలో రూ.660 కోట్లు ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం టవర్ల అమ్మకం ద్వారా సమకూరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆ