Skip to main content

Posts

Showing posts with the label ప్రపంచ బ్యాంకు

వ్యాపార అనుకూల దేశాల జాబితాలో మెరుగుపడ్డ భారత్‌ స్థానం

ప్రపంచంలోని 189 దేశాల్లో 2016 సంవత్సరానికి గాను వ్యాపార అనుకూల దేశాల జాబితాను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. వ్యాపార అనుకూల దేశాల జాబితాలో ఈసారి భారత్‌ స్థానం మెరుగుపడింది. 142 నుంచి 130వ స్థానానికి భారత్‌ చేరినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. భారత్‌ పురోభివృద్ధికి ఈనివేదిక నిదర్శమని భావిస్తున్నారు. గతేడాది 128వ స్థానంతో మనకంటే మెరుగ్గా ఉన్న పాకిస్థాన్‌ ఈసారి 10 స్థానాలు దిగజారి ప్రస్తుతం 138వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో సింగపూర్‌, రెండో స్థానంలో న్యూజిలాండ్‌, మూడో స్థానంలో డెన్మార్క్‌ నాలుగో స్థానంలో దక్షిణ కొరియా, ఐదో స్థానంలో హాంకాంగ్‌, ఆరో స్థానంలో బ్రిటన్‌, ఏడో స్థానంలో యూఎస్‌, ఎనిమిదో స్థానంలో స్వీడన్‌, తొమ్మిదో స్థానంలో నార్వే, పదో స్థానంలో ఫిన్‌లాండ్‌ నిలిచాయి. మన పొరుగు దేశం చైనా గతేడాది 90వ స్థానంలో ఉండగా ఈసారి 6 పాయింట్లు మెరుగుపడి 84వ స్థానంలో నిలిచింది. మొత్తం 11 అంశాలను పరిగణనలోకి తీసుకుని అంశాల వారీగా ర్యాంకులు వెల్లడించినట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఈనాడు