Skip to main content

Posts

Showing posts with the label IOE

‘ఐఒఇ’ (IOE)తో అనేక ప్రయోజనాలు

వ్యాపారాలకి ఆక్సిజన్‌ ‘యాప్స్‌’ ఇంటర్నెట్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌ (ఐఒఇ) అనేది చాలా శక్తివంతమైనది. నా వరకయితే ఐఒఇ అనేది ప్రజల తెలివైన జీవన విధానానికి అర్థం. నగరాల్లో వ్యర్థాలను పారేయడం దగ్గర్నించి పార్కింగ్‌ సమస్య వరకు దీన్ని తెలివిగా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకటేంటి ఆరోగ్యం, విద్య, వ్యవసాయం ఏ అంశం గురించయినా ఇంటర్నెట్‌ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంది. అదికూడా లైవ్‌లో. ముందుముందు పర్సనల్‌ అసిస్టెంట్‌కి బదులుగా మీ శరీరంలో ఒక డివైజ్‌ (సెన్సార్‌)ను అమర్చుకుని మీ తరువాత మీటింగ్‌ ఎప్పుడుంది... వంటి వివరాలన్నీ ప్లాన్‌ చేసుకునే అవకాశం రావొచ్చు. ముందు ముందు ఎలా ఉండబోతుందో ఎవరు చెప్పగలరు. ఇది మాత్రం కచ్చితంగా జరుగుతుంది... అప్పుడు దీని ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతుంది. భారత్‌లో బోలెడు అవకాశం భారతదేశంలో ఇందుకు అపారమైన అవకాశం ఉంది. ప్రధాని మోదీ మాట్లాడుతున్న డిజిటైజేషన్‌ ఇదే. మన దగ్గర టెక్నాలజీ ఉంది. దాన్ని మనం ప్రతి చోటా, ప్రతి రంగంలో వాడుకోగలగాలి. ఉదాహరణకు బెంగళూరులో ట్రాఫిక్‌నే తీసుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది. దాన్ని మనం మేనేజ్‌ చేయలేమా అంటే చేయగలం. అదికూడా టెక్నాలజీ సాయంతో చేయగలం. అర్