Skip to main content

Posts

Showing posts with the label పెట్టుబడి

జర్మనీకి రెడ్‌ కార్పెట్‌

డిఐపిపిలో ప్రత్యేక వ్యవస్థ రైల్వే, ఏవియేషన్‌, రక్షణ విభాగాల్లో విస్తృత సహకారం  సోలార్‌ రంగానికి రూ.6,900 కోట్ల ప్రత్యేక నిధి  ఇయుతో ఎఫ్‌టిఎ పైనా చర్చలు పునరుద్ధరణ భారత్‌-జర్మనీ అధినేతల సంయుక్త ప్రకటన  న్యూఢిల్లీ :  భారత్‌లో జర్మనీ పెట్టుబడులకు సత్వర అనుమతులు మంజూరు చేసేందుకు ఉభయ దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అలాగే భారత్‌లో సౌరవిద్యుత్‌రంగం అభివృద్ధి కోసం 100 కోట్ల యూరోల (6900 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందించేందుకు జర్మనీ అంగీకరించింది. ప్రస్తుతం గ్రీన్‌ కారిడార్‌కు అందిస్తున్న 100 కోట్ల యూరోల ఆర్థిక సహాయానికి ఇది అదనం. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రధాని నరేంద్రమోదీతో విస్తృత స్థాయి చర్చల అనంతరం ఉభయులు జారీ చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలు చోటు చేసుకున్నాయి. ఉభయ దేశాల మధ్య భిన్న రంగాల్లో సహకారంపై 13 ఒప్పందాలు కుదిరాయి. మోదీ, మెర్కెల్‌ మూడవ అంతర్‌ ప్రభుత్వ శిఖరాగ్ర స్థాయి సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటు వేరుగా కూడా మూడు గంటల పాటు భిన్న అంశాలపై చర్చలు జరిపారు. రైల్వే, ఏవియేషన్‌, రక్షణ, భద్రత, గూఢచర్యం, వాణిజ్