Skip to main content

Posts

Showing posts with the label భారత్‌లో తయారీ

చిన్న పరిశ్రమలకు ఉజ్వల భవిత

‘భారత్‌లో తయారీ’లో కీలక భూమిక వాటిదే తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు అపారం పారిశ్రామిక విధానాలతో వూతం ‘ఈనాడు’తో జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ సీఎండీ రవీంద్రనాథ్‌ భా రత్‌లో తయారీ (మేక్‌ ఇన్‌ ఇండియా)లో చిన్న పరిశ్రమలు కీలక పాత్ర వహిస్తాయని జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌-ఎన్‌ఎస్‌ఐసీ) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్న పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రెండు ప్రభుత్వాలు ప్రకటించిన పారిశ్రామిక విధానం ఇందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు పురోగమించాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ రవీంద్రనాథ్‌ శుక్రవారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతటా చిన్న పరిశ్రమలే... చైనా వంటి దేశాలు చిన్న పరిశ్రమలతోనే అగ్రగాములుగా ఎదిగాయి. మన దేశంలోనూ అవి అభివృద్ధికి ఆనవాళ్లుగా నిలిచాయి. కుగ్రా