Skip to main content

Posts

Showing posts with the label ఆంధ్రప్రదేశ్‌

ఏపితో వర్తక సంబంధాలకు దక్షిణ కొరియా ఆసక్తి

విశాఖపట్నం:-  ఆంధ్రప్రదేశ్‌తో వర్తక, వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు దక్షిణ కొరియా ముందుకు వచ్చింది. కొరియా ట్రేడ్ సెంటర్‌కు చెందిన బృందం బుధవారం విశాఖ పోర్టును సందర్శించింది. కొరియా ట్రేడ్ సెంటర్ డైరెక్టర్, ఎంబసీ మిన్‌జూన్ పార్క్ నేతృత్వంలో ట్రేడ్ సెంటర్‌కు చెందిన కంగ్‌సుక్ జంగ్, దౌన్ జంగ్ బృందం విశాఖ పోర్టులో పర్యటించింది. వీరికి పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ హరనాథ్ స్వాగతం పలికారు. పోర్టు విస్తరణ పనులను పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు కొరియా బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కొరియా ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో వర్తక, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. కోస్తా తీరంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. తరువాత డిప్యూటీ చైర్మన్ హరనాథ్‌తో కొరియా బృందం సమావేశమైంది. విశాఖ పోర్టులో ఉన్న వౌలిక సదుపాయాలను కొరియా బృందానికి ఆయన తెలియచేశారు. ఇప్పటికే భారత్, కొరియాల మధ్య అన్ని విధాలా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, వర్తక, వాణిజ్యాన్ని మరింత అభివృద్ధి చేసి, ఇరు దేశాల బంధాన్ని పెంచాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని కొరియా ప్రతినిధులు

సెరా, అంజనీ టైల్స్‌ భాగస్వామ్యంలో నెల్లూరులో సిరామిక్‌ విట్రిఫైడ్‌ టైల్స్‌ ప్లాంట్‌

గుజరాత్ ‌ కు చెందిన సానిటరీ ఉత్పత్తుల తయారీ కంపెనీ సెరా సానిటరీవేర్ ‌ లిమిటెడ్ ‌.. ఆంధ్రప్రదేశ్ ‌ కు చెందిన అంజనీ టైల్స్ ‌ తో కలిసి సిరామిక్ ‌ విట్రిఫైడ్ ‌ టైల్స్ ‌ తయారీ ప్లాంట్ ‌ ను ఏర్పాటు చేయనుంది . దీన్ని ఆంధ్రప్రదేశ్ ‌ లోని నెల్లూరులో నెలకొల్పాలని కంపెనీలు నిర్ణయించాయి . ఈ ప్లాంట్ ‌ కు సంబంధించి రెండు కంపెనీలు ఒక జాయింట్ ‌ వెంచర్ ‌ ను ఏర్పాటు చేయనున్నాయి . ఇందులో సెరాకు 51 శాతం , అంజనీ టైల్స్ ‌ కు 49 శాతం వాటా ఉంటుంది . 68 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్లాంట్ ‌ ను నిర్మించాలని కంపెనీలు భావిస్తున్నాయి . నిధులను రుణం , ఈక్విటీ ద్వారా సమీకరించనున్నారు . వచ్చే ఏడాదిలోనే ఈ ప్లాంట్ ‌ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీలు నిర్ణయించాయి . కాగా సెరా 18.36 కోట్ల రూపాయలు , అంజనీ 17.64 కోట్ల రూపాయలను ప్రారంభంలో ప్లాంట్ ‌ కోసం సమకూర్చనున్నాయి . ఈ ప్లాంట్ ‌ లో రోజుకు 10,000 చదరపు మీటర్ల సెరామిక్ ‌ టైల్స్ ‌ ను ఉత్పత్తి చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి . ఇదిలా ఉంటే .. సెప్టెంబర్ ‌ తో ముగిసిన త్రైమాసికానికి సెరా సా

రాజధానులకే మణిపూస!

దేశవిదేశాల్లోని ప్రణాళికాబద్ధ నగరాల పరిశీలన   ఇతర రాష్ట్రాల, దేశాల ముఖ్యపట్టణాల అనుభవాల నుంచి పాఠాలు   వాటన్నిటికంటే మిన్నగా నిర్మించాలని సంకల్పం   ఏపీ రాజధాని అమరావతి 21వ శతాబ్దంలో అందరి దృష్టినీ ఆకర్షించనుంది. వందేళ్ల ముందుచూపుతో, పకడ్బందీ వ్యూహాలతో అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. ఇందుకోసం ఇప్పటికే దేశవిదేశాల్లోని పలు నగరాల ప్రణాళికలను పరిశీలించారు. వాటిలోని మంచిచెడులు.. లాభనష్టాలను బేరీజు వేశారు. మరోవైపు చిన్న దేశాలైన కజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ రాజధానుల్లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. సోవియట్‌ యూనియన్‌ నుంచి వేరుపడిన ఆయా దేశాలు సాధించిన అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు ఆకట్టుకోవడంతో వాటినీ పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆధునిక నిర్మాణ మెలకువలు, అందుబాటులోని వనరుల ఆలంబన, మౌలిక సదుపాయాల కల్పన, పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సాగుతోంది. ఇందుకోసం సమకాలీన భారతంలో నిర్మితమైన నగరాలు, రాజధానులు ఎదుర్కొ