Skip to main content

Inspire

Inspire
all about inspirational & successful people

Tata Power arm signs share purchase agreement to acquire Welspun Renewables Energy


  • Tata Power's generation capacity to cross 10,000 MW reinforcing its position as India's largest integrated power company
  • Tata Power Renewable Energy’s renewable assets portfolio grows to about 2,300 MW making it the largest renewable power company in India
National: Tata Power Company (Tata Power), India’s largest integrated power company, announced today that, Tata Power Renewable Energy (TPREL), a 100 percent subsidiary of Tata Power, has signed an SPA with Welspun Energy (WEPL) to acquire its subsidiary Welspun Renewables Energy (WREPL). This represents the largest transaction in renewables space in India.
WREPL has one of the largest operating solar portfolios in India spread across ten states. It has about 1,140 MW of renewable power projects comprising of about 990 MW solar power projects and about 150 MW of wind power projects. Out of 1,140 MW renewable portfolio, nearly 1,000 MW of capacity is operational and balance capacity is under advanced stages of implementation.
TPREL currently operates 294 MW of renewable power capacity and 500 MW of renewable assets are being carved out of Tata Power into TPREL through a court process. In addition, almost 400 MW of solar and wind power projects are under implementation. Thus, TPREL with all these assets, would have renewable assets portfolio of about 2,300 MW making it the largest renewable power company in India.
Speaking on achieving this milestone, Anil Sardana, CEO and MD, Tata Power, said, “The company is pursuing growth in renewable energy space to create value for its shareholders through various organic and inorganic growth opportunities. This acquisition will enable the company to deliver significant value for all stakeholders as most of the assets are revenue generating and operating assets. Tata Power can further enhance value of these assets with its operational experience and financial optimization. The acquisition is also a significant step towards attaining the company's objective of having non-fossil fuel based capacity up to 30-40 percent of its total generating capacity".
JM Financial Institutional Securities acted as exclusive transaction advisor to TPREL in relation to this transaction. KPMG India was the accounting and tax advisor. AZB & Partners acted as the legal advisor for this transaction.

------------------in Telugu...........................

టాటా చేతికి వెల్‌స్పన్‌ ఎనర్జీ 


న్యూఢిల్లీ : వెల్‌స్పన్‌ ఎనర్జీకి అనుబంధంగా పని చేస్తున్న వెల్‌స్పన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ కంపెనీని (డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌) కొనుగోలు చేస్తున్నట్టు టాటా పవర్‌ ప్రకటించింది. షేర్‌ కొనుగోలు ఒప్పందం కింద తమ అనుబంధ సంస్థ టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ (టిపిఆర్‌ఈల్‌) ఆ కంపెనీని కొనుగోలు చేస్తుందని టాటా పవర్‌ తెలియచేసింది. డీల్‌ విలువ 9,249 కోట్ల రూపాయలని బిఎ్‌సఇకి పంపిన ప్రకటనలో తెలిపింది. 2016 ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌ కన్సాలిడేటెడ్‌ ఆదాయాలు 768 కోట్ల రూపాయలు. టాటా పవర్‌ నూరు శాతం అనుబంధ సంస్థ టిపిఆర్‌ఈల్‌ ఈ మేరకు వెల్‌స్పన్‌తో ఒక అంగీకారం కుదుర్చుకుంది. దేశంలో రెన్యువబుల్‌ ఇంధన విభాగంలో ఇదే అతి పెద్ద డీల్‌. డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌కు దేశంలోని పది రాష్ర్టాల్లో సోలార్‌ ప్లాంట్లున్నాయి. మొత్తం ఉత్పాదక సామర్థ్యం 1140 మెగావాట్లు కాగా 990 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు, 150 మెగావాట్ల పవన విద్యుత ఉత్పత్తి చేస్తోంది. ఇందులో వెయ్యి మెగావాట్ల విద్యుతను ఇప్పటికే ఉత్పత్తి చేస్తుండగా మిగతా సామర్థ్యాన్ని జోడించే వివిధ ప్రాజెక్టులు పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. టిపిఆర్‌ఈల్‌ 294 మెగావాట్ల పునర్‌ వినియోగ ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మరో 500 మెగావాట్ల ప్రాజెక్టులు టాటా పవర్‌ నుంచి టిపిఆర్‌ఈల్‌కు బదిలీ చేసే ప్రక్రియ కోర్టుల్లో ఉంది. ఇవి కాకుండా 400 మెగావాట్ల సోలార్‌, పవన విద్యుత ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ కొనుగోలుతో టాపిఆర్‌ఈల్‌ 2300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఆస్తులతో పునర్‌ వినియోగ ఇంధనాల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి కంపెనీ అవుతుంది. కంపెనీల కొనుగోళ్లతో పాటుగా ప్రస్తుత ఉత్పాదక సామర్థ్యాల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వాటాదారుల సొమ్ముకు తగినంత విలువ చేకూర్చాలని తాము భావిస్తున్నట్టు టాటా పవర్‌ సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ సర్దానా అన్నారు. డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌ ఆస్తులన్నీ ఆదాయం ఆర్జిస్తున్న ఆస్తులు కావడం వల్ల వాటిని కొనుగోలు చేయడం ద్వారా వాటాదారులందరికీ మంచి లాభాలు అందించబోతున్నామని ఆయన చెప్పారు. తమకు గల నిర్వహణా సామర్థ్యంతో పాటు ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చుకోవడం ద్వారా తాము ఆ ఆస్తుల విలువను మరింతగా పెంచగలమని ఆయన అన్నారు. తమ మొత్తం ఉత్పత్తిలో 30 నుంచి 40 శాతం శిలాజేతర ఇంధనాల నుంచి సాధించాలన్న బృహత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఈ కొనుగోలు ఒక పెద్ద అడుగవుతుందని ఆయన పేర్కొన్నారు.
 
ప్రాంప్టెక్‌ రెన్యూవబుల్స్‌లో హావెల్స్‌ వాటా పెంపు 
విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా బెంగళూరుకి చెందిన ప్రాంప్టెక్‌ రెన్యూవబుల్స్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌లో వాటాలను 70 శాతానికి పెంచుకుంది. డీల్‌ విలువ ఎంత అన్నది కంపెనీ ప్రకటించలేదు. ఈ మేరకు తమకు, ప్రాంప్టెక్‌ కంపెనీకి, ఆ కంపెనీ షేర్‌హోల్డర్లకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్టు హావెల్స్‌ బిఎస్‌ఇకి పంపిన సందేశంలో తెలిపింది. వీధి దీపాలు, ఆఫీస్‌, సోలార్‌ లైటింగ్‌ వ్యవస్థలకు అవసరమైన ఎల్‌ఇడి ఉత్పత్తులు తయారీ, మార్కెటింగ్‌ కార్యకలాపాలు ప్రాంప్టెక్‌ నిర్వహిస్తోంది.

Comments