Skip to main content

Posts

Showing posts with the label సౌర విద్యుత్‌

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పబోయే సౌర విద్యుత్‌ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దది

ఏపీలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ పార్కు  ఆంధ్రప్రదేశ్‌ చొరవ, స్పందన బాగుంది  మార్చిలోగా 619 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించాలి  ఎంఎన్‌ఆర్‌ఈ సంయుక్త కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ ఆం ధ్రప్రదేశ్‌లో నెలకొల్పబోయే సౌర విద్యుత్‌ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దది అయ్యే అవకాశముందని కేంద్ర సంప్రదాయేతర ఇంధనవనరులశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) సంయుక్త కార్యదర్శి తరుణ్‌కపూర్‌ చెప్పారు. 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం కలిగిన ‘పార్కు’ను ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినయోగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చొరవ, స్పందన బాగుందని ఆయన ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులను అంతర్జాతీయస్థాయిలో ఆకర్షించేలక్ష్యంతో జరుపుతున్న ప్రాంతీయ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమావేశం బుధవారం ఉదయం ఇక్కడ జరిగింది. ఎంఎన్‌ఆర్‌ఈ, భారతీయ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఇరిడా), ఆంధ్రప్రదేశ్‌ నూతన మరియు పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌కాప్‌) సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. పెట్టుబడులకు మంచి అవకాశం  ఆంధ్రప్రదేశ్‌లో పవన, సౌర వి