Skip to main content

Posts

Showing posts with the label ఆంధ్రప్రదేశ్‌

రాజధానులకే మణిపూస!

దేశవిదేశాల్లోని ప్రణాళికాబద్ధ నగరాల పరిశీలన   ఇతర రాష్ట్రాల, దేశాల ముఖ్యపట్టణాల అనుభవాల నుంచి పాఠాలు   వాటన్నిటికంటే మిన్నగా నిర్మించాలని సంకల్పం   ఏపీ రాజధాని అమరావతి 21వ శతాబ్దంలో అందరి దృష్టినీ ఆకర్షించనుంది. వందేళ్ల ముందుచూపుతో, పకడ్బందీ వ్యూహాలతో అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. ఇందుకోసం ఇప్పటికే దేశవిదేశాల్లోని పలు నగరాల ప్రణాళికలను పరిశీలించారు. వాటిలోని మంచిచెడులు.. లాభనష్టాలను బేరీజు వేశారు. మరోవైపు చిన్న దేశాలైన కజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ రాజధానుల్లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. సోవియట్‌ యూనియన్‌ నుంచి వేరుపడిన ఆయా దేశాలు సాధించిన అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు ఆకట్టుకోవడంతో వాటినీ పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆధునిక నిర్మాణ మెలకువలు, అందుబాటులోని వనరుల ఆలంబన, మౌలిక సదుపాయాల కల్పన, పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సాగుతోంది. ఇందుకోసం సమకాలీన భారతంలో నిర్మితమైన నగరాలు, రాజధానులు ఎదుర్కొ