ఆన్లైన్ టీచింగ్ ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. ఒక్క సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ అయినా సరే మీ పాఠాలు వినేందుకు ఆన్లైన్లో పిల్లలు క్యూ కడతారు. లోతైన విషయ పరిజ్ఞానం, ఇంగ్లీష్‌లో బోధనా సామర్థ్యం ఉంటే చాలు ఆన్లైన్ టీచింగ్‌లో దూసుకుపోవచ్చు. ఎన్నో వెబ్సైట్లు ఆన్లైన్ టీచింగ్‌కు కార్పొరేట్ హంగులు తీసుకొచ్చాయి. ఔత్సాహిక ఉపాధ్యాయులకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నాయి.
ట్యూటర్ విస్టా..(www.tutorvista.co.in)
ఆన్లైన్ టీచింగ్ జాబ్స్‌కు ఇది బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా పేరొందింది. ఆన్లైన్లో పాఠాలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..? అయితే ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయితే చాలు. మీ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆధారంగా మీకు బోలెడన్ని అవకాశాలు కల్పిస్తుంది. ఈ వెబ్‌సైట్‌కు స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంది. వీరిలో ఎక్కువగా అమెరికాకు చెందినవారే ఉన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిసీ్ట్ర, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇందులో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ట్యూటర్‌గా కూడా పని చేయవచ్చు. మీరు తీసుకునే క్లాసులను బట్టి పేమెంట్ ఉంటుంది.
ట్యూటర్.కామ్ ఆన్లైన్ టీచర్లకు బెస్ట్ ఆఫర్స్ అందిస్తోంది. అకౌంటింగ్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల్లో మీరు నిష్ణాతులైతే ట్యూటర్ ద్వారా మీ టీచింగ్ ప్రొఫెషన్‌ను మొదలుపెట్టొచ్చు. కెమిస్ట్రీ ట్యూటర్స్ నెలకు 800 నుంచి 1500 డాలర్ల వరకు సంపాదిస్తున్నారు.
అన్లైన్ టీచింగ్‌లో ట్రాన్స్ట్యూటర్స్ పోర్టల్ మంచి నెట్వర్క్ కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ట్రాన్స్ట్యూటర్స్ను ఫాలో అవుతున్నారు. ఇరవై వేల మంది టీచర్లు దీని ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు. ఈ వెబ్సైట్ అట్రాక్టివ్ పేమెంట్ ఆఫర్ ఇస్తోంది. స్టూడెంట్స్‌కు వచ్చే ఒక్కో డౌట్ క్లారిఫై చేసే కొద్దీ మీ అకౌంట్లో 3 డాలర్లు వచ్చి చేరుతుంటాయి.
ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ వివరాలు అందజేయడంలో బడ్డీస్కూల్ వెబ్సైట్ ముందంజలో ఉంది. ఆన్లైన్ టీచర్ అవకాశాల కోసం ప్రయత్నించేవారు ముందుగా ఇందులో ప్రొఫైల్ పొందుపరచాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఏడాదికి పది డాలర్లు ఫీజు వసూలు చేస్తారు. మీ ప్రొఫైల్‌కు తగ్గట్టుగా ఎలాంటి అవకాశాలు వచ్చినా వెబ్సైట్ నిర్వాహకులు మీకు వెంటనే సమాచారం అందజేస్తారు.
ఇది భారతీయుల కోసమే ప్రత్యేకంగా పని చేస్తోంది. ఆన్లైన్ టీచింగ్‌తో పాటు హోమ్ ట్యూటర్స్ జాబ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతున్న టీచర్లకు అవకాశాలు కల్పించడంతో పాటు స్టూడెంట్స్‌కు బెస్ట్ టీచర్స్ వివరాలను అందజేస్తుంది.
మూలం: ఆంద్రజ్యోతి
Comments